Thu. Jun 25th, 2026

మైథలాజికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘నాగబంధం’ మూవీ జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. విరాట్ కర్ణ, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ నామా ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ చిత్రాన్ని అమెరికాలో ఒక రోజు ముందే, అంటే జూలై 2న ప్రీమియర్స్ వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, భారతీయ పురాణాల గొప్పదనం, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్ మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో విజువల్ వండర్‌గా రాబోతోంది.

నార్త్ అమెరికాలో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు వెర్షన్‌నే యునైటెడ్ స్టేట్స్, కెనడాల్లోని 250కి పైగా లొకేషన్లలో విడుదల చేస్తుండటం విశేషం.

The put up అక్కడ ‘నాగబంధం’ ప్రీమియర్స్ డేట్ ఫిక్స్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.