Thu. Jun 25th, 2026

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి పనిచేయడంపై మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పనిచేసిన దర్శకులలో మోహన్ లాల్ మినహా మిగిలిన వారందరికంటే రాజమౌళినే బెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. రాజమౌళి కేవలం సీన్లు వివరించడమే కాకుండా, స్వయంగా నటించి చూపిస్తూ ఆ పాత్రల ఎమోషన్లను నటీనటులకు అద్భుతంగా అర్థమయ్యేలా చెప్తారని పేర్కొన్నాడు.

అయితే నటీనటులు తన నటనను కేవలం ఒక రిఫరెన్స్‌గా మాత్రమే తీసుకుని, వారి సొంత శైలిలోనే ఆ పాత్రలను ఆవిష్కరించేలా రాజమౌళి ప్రోత్సహిస్తారని పృథ్వీరాజ్ వివరించాడు. రాజమౌళికి ఉన్న ఈ క్లారిటీ సెట్స్‌పై నటీనటులకు కొండంత నమ్మకాన్ని ఇస్తుందని ఆయన ప్రశంసించాడు.

ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో పృథ్వీరాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

The publish రాజమౌళి నెక్స్ట్ లెవెల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ – పృథ్వీరాజ్ సుకుమారన్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.