Thu. Jun 25th, 2026

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు పలువురు డైరెక్టర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాను బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో చేసే అవకాశం ఉందని.. అది ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్‌టైనర్ కానుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మొదట సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చకపోవడంతో అనిల్ రావిపూడి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

అయితే, ప్రస్తుతం మహేష్ బాబు పూర్తి దృష్టి రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంపైనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే ఆయన తన నెక్స్ట్ చిత్రంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

The submit మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ జోనర్‌లో ఉంటుందా..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.