తమిళ స్టార్ హీరో సూర్య, ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ‘కర్ణ’ అనే పౌరాణిక చిత్రం కోసం జతకట్టారు. ఈ ప్రాజెక్ట్ తో సూర్య బాలీవుడ్ లో అరంగేట్రం చేయాల్సి ఉండగా, బడ్జెట్ పరిమితుల కారణంగా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఐతే, గత రెండు రోజులుగా, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఒక పీరియడ్ డ్రామా కోసం సల్మాన్ ఖాన్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో చేతులు కలపనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా అప్ డేట్ ప్రకారం, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తన ‘కర్ణ’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తీస్తున్నారని తెలుస్తోంది.
అయితే, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో యాక్ట్ చేయాలా ? లేదా ? అనేది ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. కానీ అభిమానులు మాత్రం సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని పోస్ట్ లు పెడుతున్నారు. ఒకవేళ, అభిమానులు కోరుకున్నట్టు సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, భారతీయ సినిమాలోని ప్రస్తుత అతిపెద్ద స్టార్లలో మరొకరు మహాభారతంలోని పాత్రను పోషించినట్టు అవుతుంది. కల్కిలో ప్రభాస్ కర్ణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. మరి ఇప్పుడు సల్మాన్ కూడా కర్ణ పాత్రలో కనిపిస్తాడా ? లేదా ? అనేది చూడాలి.
The submit సౌత్ స్టార్ కథతో సల్మాన్ ఖాన్ సినిమా ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
