సోషల్ మీడియా సెలబ్రిటీ అషు రెడ్డి తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మెడలో పూల దండలు, చేతికి ఉంగరం తో ఉన్న ఈ ఫోటోలు చూస్తుంటే ఆమెకు నిశ్చితార్థం జరిగినట్లు కనిపిస్తోంది. అయితే, ఆమె పక్కన ఉన్న వ్యక్తి ముఖాన్ని రివీల్ చేయకపోవడంతో ఆ మిస్టరీ మ్యాన్ ఎవరనే చర్చ మొదలైంది.
గతంలో ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసి, సుమారు రూ. 9 కోట్లు వసూలు చేసిందంటూ అషు రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉండగానే ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడం గమనార్హం. ఒకవేళ ఆమె నిశ్చితార్థం చేసుకున్నది సదరు ధర్మేంద్రతోనే అయితే, ఈ కేసు సద్దుమణిగే అవకాశం ఉంది.
రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో పాపులర్ అయిన అషు, ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఈ చీటింగ్ కేసు మరియు నిశ్చితార్థం వార్తలు ఆమెను మరోసారి చర్చల్లోకి తెచ్చాయి. మరి ఈ ఫొటోలపై అషు రెడ్డి ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
The submit అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ జరిగిందా.. ఫోటోలతో క్లూ ఇచ్చిన బ్యూటీ..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
