Sun. Jul 26th, 2026

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ డ్రామా ‘ఆదర్శ కుటుంబం’. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

​ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ సినిమా ప్రమోషన్ల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి చిత్రంలోని కీలక పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ముందుగా హీరో వెంకటేష్ పోషిస్తున్న చిట్టి బాబు పాత్రను పరిచయం చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, యువిన్ పార్థవి, మరియు రాజా ప్రజ్వల్ లు వెంకటేష్ కుటుంబ సభ్యులుగా కనిపించనున్నారు.

​హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

The submit ఆదర్శ కుటుంబం ప్రొమోషన్స్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.