‘లెనిన్’ చిత్రంతో తన చిన్న కుమారుడు అఖిల్ సాధించిన విజయం పట్ల కింగ్ నాగార్జున తీవ్ర సంతోషంతో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన తన మైలురాయి చిత్రం ‘కింగ్ 100’పై పూర్తి దృష్టి సారించాడు. ఈ సినిమా దసరాకి విడుదలవుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, దసరా బరిలో ఇతర చిత్రాలు ఎక్కువగా ఉండటంతో నాగార్జున తొందరపడకుండా సరైన సమయానికే సినిమాను తీసుకురావాలని భావిస్తున్నాడు.
అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు నాగచైతన్య, అఖిల్‌లతో 2027 సంక్రాంతికి అనుకున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను నాగార్జున తాత్కాలికంగా పక్కన పెట్టారు. ‘కింగ్ 100’ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదా గ్లింప్స్ రాలేదు.
కాగా, ఆగస్టులో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మొదటి అప్డేట్ రానుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రా కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు.
The publish దసరా ఆశలు వదిలేసిన నాగార్జున..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
