సూపర్ స్టార్ కృష్ణ మనవడు జై కృష్ణ ఘట్టమనేని, అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. రాషా తడాని హీరోయిన్ గా, మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా జూలై 30న విడుదలవుతుండగా, జై కృష్ణ విలేకరుల సమావేశంలో విశేషాలు పంచుకున్నాడు.
మీకు యాక్టర్ కావాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?
16 ఏళ్ల వయసులోనే నటుడిని కావాలనుకుని ముంబై, పాండిచ్చేరి, న్యూయార్క్‌లలో నాలుగేళ్లకు పైగా యాక్టింగ్ శిక్షణ తీసుకున్నాను. ఇండియా తిరిగొచ్చాక కథలు వినడం స్టార్ట్ చేశాను. ఈ సినిమా కోసం అజయ్ గారు మూడు నెలల పాటు లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్‌పై ముందస్తుగా వర్క్‌షాప్ నిర్వహించి నన్ను సిద్ధం చేశారు.
‘శ్రీనివాస మంగాపురం’ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
జెమినీ కిరణ్ గారి ద్వారా అజయ్ గారి పరిచయం జరగడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అంతకుముందు కొన్ని కథలు విన్నప్పటికీ, అజయ్ గారు చెప్పిన కథలోని అద్భుతమైన ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టర్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒక మంచి కథతోనే హీరోగా పరిచయం కావాలనుకున్న నా ఆలోచనకి అన్ని విధాలా సరిపోయే కథ ఇది.
మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మహేష్ గారు ఈ సినిమా చూశారా ?
నాకు ఫ్యామిలీ సపోర్ట్ కొండంత ఉంది. ప్రతి అడుగులో బంగారు తాతయ్య ప్రోత్సాహం, మహేష్ బాబాయ్ గైడెన్స్ నాకు ఎంతో లభించాయి. బాబాయ్ ఇప్పటికే ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నా యాక్షన్, సాంగ్స్, క్యారెక్టర్లో నేను ఒదిగిపోయిన తీరు చాలా నచ్చాయని స్వయంగా మెసేజ్ చేసి అభినందించారు.
‘శ్రీనివాస మంగాపురం’ ఎలా ఉంటుంది?
ఈ సినిమా చాలా రియలిస్టిక్, రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. సాధారణ టెంప్లేట్ లవ్ స్టోరీలా కాకుండా, ఇందులో ఉండే బలమైన ఎమోషన్స్, కొత్త తరహా ట్విస్టులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.
రాషా తడానీ గురించి?
రాషా ఈ సినిమా చేయడం ఈ సినిమాకి ఒక మంచి అసెట్. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. కచ్చితంగా ఆడియన్స్ ఆమె పెర్ఫార్మెన్స్ను చాలా ఎంజాయ్ చేస్తారు.
మోహన్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి?
మోహన్ బాబు గారు వ్యక్తిగతంగా చాలా స్వీట్ అండ్ క్లోజ్‌గా ఉంటారు. అయితే కెమెరా ముందుకు వచ్చేసరికి మాత్రం పూర్తి ఏకాగ్రతతో నిమగ్నమైపోతారు.
జీవీ ప్రకాష్ మ్యూజిక్ గురించి?
జీవీ ప్రకాష్ అందించిన అద్భుతమైన సంగీతం, ఇందులోని ఆరు పాటలు మరియు డాన్స్ నంబర్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి. అజయ్ విజన్‌కి తగ్గట్టుగా సాగే ఈ మ్యూజిక్‌తో పాటు, సినిమాలోని ఊహించని సర్ప్రైజెస్ ఆడియన్స్‌కు అదిరిపోయే అనుభూతిని ఇస్తాయి.
అజయ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ఆయన విజన్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. నా మొదటి సినిమాకే అలాంటి దర్శకుడితో వర్క్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను; ఇది నాకు ఎంతో ఉపయోగపడింది.
భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో కూడా మంచి కథలతోనే ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాను.
The publish ఇంటర్వ్యూ : హీరో జై కృష్ణ ఘట్టమనేని – ‘శ్రీనివాస మంగాపురం’ అందరికీ కనెక్ట్ అవుతుంది..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
