న్యాచురల్ స్టార్ నాని, నివేదా థామస్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘నిన్ను కోరి’ నేడు (మే 8, 2026) గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ రీ-రిలీజ్ హంగామాలో స్వయంగా హీరోయిన్ నివేదా థామస్ పాల్గొని అభిమానులను సర్ప్రైజ్ చేసింది. థియేటర్లో సినిమా చూస్తూ ఆడియన్స్‌తో కలిసి ఆమె సందడి చేసింది.
ముఖ్యంగా థియేటర్లో ‘ఆయా షేర్’ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో నివేదా థామస్ ఫుల్ జోష్‌లో ఆ పాటకు వైబ్ అవుతూ కనిపించింది. నివేదాలోని ఈ ఉత్సాహాన్ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నాని మాస్ ర్యాంపేజ్‌కు నివేదా కూడా వైబ్ అవుతుండటంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
The put up ఆయా షేర్ పాటకు ఫుల్ వైబ్ అవుతున్న నివేదా థామస్.. నెట్టింట వీడియో వైరల్..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
