టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్ టీమ్ క్లారిటీతో చెక్ పెట్టింది. తిరుపతిలో ఫ్యాన్స్ మీటింగ్, ‘ఊరు-వాడ’ యాత్ర, అలాగే ‘RAW NTR’ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారిక లేఖ ద్వారా స్పష్టం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు ఏకంగా పార్టీ చీలికలపై విశ్లేషణలు చేసినప్పటికీ, తారక్ టీమ్ ఇచ్చిన ఈ క్లారిఫికేషన్‌తో ఆ రూమర్లకు పుల్‌స్టాప్ పడింది. అంతకుముందు అల్లు అర్జున్ కూడా కొత్త పార్టీ పెడుతున్నారని, ప్రశాంత్ కిషోర్‌ను కలిశారంటూ జోరుగా ప్రచారం జరిగింది.
బన్నీ సన్నిహితులు ఈ వార్తలను ఖండించినప్పటికీ, ఎన్టీఆర్ తరహాలో ఆయన ఆఫీస్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది కూడా వస్తే ఈ పొలిటికల్ రూమర్ల గందరగోళానికి పూర్తిగా తెరపడుతుంది.
The submit ఎన్టీఆర్ ఇచ్చేశాడు.. ఇక బన్నీ కూడా ఇస్తే బాగుంటుంది..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
