Tue. Jul 14th, 2026

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ హాలీవుడ్ చిత్రాల్లో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘ఒడిస్సి’ కూడా ఒకటి. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్ కూడా కీలక పాత్రలో నటించిన ఈ హిస్టారికల్ సినిమా గ్రాండ్ గా జూలై 17న విడుదల కాబోతుంది.

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఓటిటిలో దాని విడుదలకి ముందే ఇదే ఒడిస్సి నుంచి మరో ట్రీట్ వచ్చేసింది. పాపులర్ ఓటిటి జియో హాట్ స్టార్ లో ఒడిస్సి మేకింగ్ డాక్యు చిత్రాన్ని తీసుకొచ్చారు. ‘ఒడిసి – ది మేకింగ్ ఆఫ్ ఎపిక్’ అంటూ విడుదల చేసిన ఈ 22 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిం బిగ్ స్క్రీన్ సినిమా చూసే ముందు తమ ప్రపంచం ఇలా ఉండబోతుంది అనేది చూపిస్తుంది. సో ఓటిటిలో చూడాలి అనుకునేవారు హాట్ స్టార్ లో చూసి తెలుసుకోవచ్చు.

The put up ఓటీటీలోకి వచ్చేసిన నోలన్ ‘ఒడిస్సి’.. కానీ? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.