This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. మూవీ లవర్స్ కు ఈ వారం పండగనే చెప్పాలి. యాక్షన్ నుంచి కామెడీ వరకు థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కంటెంట్‌ను అందించబోతున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లలో ఈ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అలరించనున్నాయి. ఇక ఇంట్లోనే కూర్చుని ఈ వారం ఎంటర్టైన్ అవ్వడానికి ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఈ వారం రిలీజ్ కాబోతున్న వాటిపై ఓ లుక్ వేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
జూలై 13న ‘మర్డర్ 101’ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ)
జూలై 14న ‘బ్యాక్ రూమ్స్’ (ఇంగ్లిష్ సినిమా)
జూలై 15న ‘రైడ్ ఆర్ డై’ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)
నెట్‌ఫ్లిక్స్
జూలై 15న ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ‘ద హాక్’,
జూలై 16న ఇండోనేసియన్ సినిమా ‘మీ బిఫోర్ మీ’,
జూలై 17న ‘ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్’ (స్పానిష్ వెబ్ సిరీస్)
జూలై 17న ‘ద ఈస్ట్ ప్యాలెస్’ (కొరియన్ వెబ్ సిరీస్), ‘డిజైర్’ (ఇంగ్లిష్ సినిమా), ‘23000 లైవ్స్’ (జర్మన్ సినిమా), ‘హార్ట్ స్టాపప్ ఫరెవర్’ (ఇంగ్లిష్ సినిమా) వీటితో పాటు జూలై 18న ‘స్పూకీ ఇన్ లవ్’ అనే కొరియన్ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవ్వబోతోంది.
జియో హాట్‌స్టార్
జూలై 17న సమంత బ్లాక్ బస్టర్ ‘మా ఇంటి బంగారం’
జూలై 13న ‘సెకండ్ లవ్’ (తమిళ రియాలిటీ వెబ్ సిరీస్), ‘పవిత్రం’ (మలయాళ సిరీస్), ‘వుథరింగ్ హైట్స్’ (ఇంగ్లీష్ మూవీ) రానుండగా, జూలై 16న ‘రెడీ ఆర్ నాట్ 2’ (తెలుగు డబ్బింగ్ సినిమా)
జూలై 18న ‘టెస్ట్ సబ్జెక్ట్ వీ’ (హిందీ డాక్యుమెంటరీ)
జీ5
అలాగే జూలై 17న జీ5 ఓటీటీలో వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’
ఎమ్ఎక్స్ ప్లేయర్
ఎమ్ఎక్స్ ప్లేయర్ లో జూలై 16న ‘రక్తాంచల్ సీజన్ 3’ (హిందీ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఇక ఈ కొత్త సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులు ఈ వారం ఫుల్ జోష్ లో ఉండబోతున్నట్లే అనిపిస్తోంది.
