Tue. Jul 14th, 2026

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లీడ్ రోల్స్‌లో వస్తున్న ‘రామాయణ’ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ ఎపిక్ ప్రాజెక్ట్ కేవలం మన దేశానికే పరిమితం కాకుండా, ఏకంగా హాలీవుడ్ సినిమాల మేకింగ్ స్టాండర్డ్స్‌కు సవాల్ విసిరే రేంజ్‌లో రూపొందుతోంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్స్‌గా నిలిచే ‘డ్యూన్’, ‘ది ఒడిస్సీ’ లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లను చూసే ప్రపంచ ప్రేక్షకులు.. మన రామాయణ క్వాలిటీ చూసి కూడా అంతే థ్రిల్ అవుతారని చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ధీమాగా చెబుతున్నారు.

ప్రపంచానికి మన కథ

భారతీయులందరికీ రామాయణం ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి నుంచి వింటూ, చదువుకుంటూ పెరిగిన మహా కావ్యం ఇది. అయితే ఈ కథను ప్రపంచ ప్రేక్షకులకు సరికొత్తగా, వాళ్లకు అర్థమయ్యే విజువల్ లాంగ్వేజ్‌లో పరిచయం చేయబోతున్నారు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తనతో మాట్లాడుతూ.. “ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, మొదటి కథను మీరు మా ముందుకు తీసుకొస్తున్నారు. మాకు ఏమాత్రం తెలియని ఈ కథను తెరపై చూడటం, ఒక కొత్త లోకాన్ని డిస్కవర్ చేసిన ఫీలింగ్ ఇస్తుంది” అని అన్నారట.

ప్రస్తుతం గ్లోబల్ ఆడియన్స్ ఎప్పుడూ ఒకే రకమైన రొటీన్ సినిమాలు చూడటానికి ఇష్టపడట్లేదు. ‘డ్యూన్’ సిరీస్ లాంటి డిఫరెంట్ ఎపిక్స్ వస్తున్నప్పుడు జనాలు కొత్తదనం కోసం థియేటర్లకు పరిగెడుతున్నారు. మన సంస్కృతికి సంబంధించిన ఈ గొప్ప కథను, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ స్క్రీన్‌పైకి తీసుకురావడం పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నట్లు నమిత్ వివరించారు.

జులై 23, 24 తేదీల్లో బిగ్ సర్‌ప్రైజ్

ఈ భారీ చిత్రంలో రావణాసురుడిగా కేజీయఫ్ స్టార్ యష్ నటిస్తుండగా.. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. దీపావళి కానుకగా 2026లో రామాయణ మొదటి భాగం, 2027లో రెండో భాగం థియేటర్లలోకి రానున్నాయి. ఇక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ ఫస్ట్ లుక్‌ను జులై 23న ప్రఖ్యాత శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఆ మరుసటి రోజే అంటే జులై 24న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్ లాంచ్ చేసి గ్లోబల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇండియన్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది.

The put up ప్రపంచానికి మన కథ: హాలీవుడ్ ఎపిక్స్‌తో ‘రామాయణ’ ఢీ.. నిర్మాత నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ కామెంట్స్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.