బాలయ్య, నాగార్జున సీక్వెల్స్ కంప్లీట్ చేశారు. వెంకీ ఫ్రాంచైజీలో భాగంగా నటించాడు కానీ కథలు వేరు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఈ ఫేజ్‌లోకి ఎంటర్ కాలేదు. యంగ్ స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ కూడా సీక్వెల్స్ టాస్క్ ఫినిష్ చేశారు. అయితే ఇప్పటివరకు సీక్వెల్స్ జోలికి పోని ఆ హీరోలు, నెక్స్ట్ ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌కు రెడీ అవుతారా? అనే ప్రశ్న తలెత్తితే అవుననే సమాధానం వినిపిస్తోంది. టాలీవుడ్‌లో ప్రజెంట్ సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్స్ టు జూనియర్స్ అందరి నోటా ఇదే పాట. బాలయ్య రెండు సార్లు అటెంప్ట్ చేశారు; ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘అఖండ’ నుండి సీక్వెల్స్ వచ్చాయి. ‘సోగ్గాడే చిన్ని నాయన’ను ‘బంగార్రాజు’గా కొనసాగించి, మూడోది పట్టాలెక్కిస్తున్నారు నాగార్జున. వెంకీ మామ సీక్వెల్స్ కాకపోయినా, ‘F2’ ఫ్రాంచైజీ నుండి ‘F3’ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఇంతవరకు సీక్వెల్స్ టచ్ చేయలేదు. నెక్స్ట్ ‘విశ్వంభర’ హిట్ కొడితే సీక్వెల్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. అది తేలాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత డార్లింగ్ నుండి వస్తున్న సీక్వెల్స్.. ‘సలార్ 2’, ‘కల్కి 2’. బన్నీ ‘పుష్ప’ని సాగదీస్తున్నాడు, ‘పుష్ప 3’ ఉండనే ఉంది. ఈ యంగ్ హీరోలు సీక్వెల్స్ కంప్లీట్ చేసేసారు. కానీ ఇప్పటి వరకు సీక్వెల్ జోలికి పోలేదు కొంతమంది యంగ్ స్టార్స్. తారక్ ‘దేవర’ తర్వాత ‘దేవర 2’ ఉంటుందని అనౌన్స్ చేశాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఉందో లేదో, షెడ్‌కి వెళ్లిందో టీమ్‌కే క్లారిటీ లేదు. నెక్స్ట్ ‘డ్రాగన్’ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మూవీ కాబట్టి సీక్వెల్ ప్లాన్ చేయొచ్చు, కానీ వెంటనే పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ‘డ్రాగన్’ పనులు చూస్తూనే, ‘సలార్ 2’ కి కథ సిద్ధం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఇప్పటివరకు సీక్వెల్ టచ్ చేయలేదు. ‘SSMB29’ (వారణాసి) టూ పార్ట్స్ ఉంటాయని గతంలో వార్తలు రాగా, రాజమౌళి కొట్టి పారేశాడు. జక్కన్న తర్వాత మహీ ఎవరితో సినిమా చేస్తారో క్లారిటీ లేదు. అంటే ఇప్పట్లో మహేష్ నుండి సీక్వెల్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయనక్కర్లేదు. చరణ్ కూడా సీక్వెల్ టాస్క్ కంప్లీట్ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత సినిమాలు హిట్ అయి ఉంటే ఏమైనా ప్లాన్ చేసేవాడేమో కానీ, రిజల్ట్స్ తేడా కొట్టాయి. నెక్స్ట్ సుకుమార్ తో మూవీ చేస్తున్నాడు. మరి లెక్కల మాస్టర్ ‘పుష్ప’లా సాగదీస్తాడో, ‘రంగస్థలం’ లాంటి మ్యాజిక్ ఏం చేస్తాడో చూడాలి.
