Sat. May 9th, 2026

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కథానాయకుడిగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ఓటీటీ వేదికగా అదరగొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ మూవీ, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. సంపత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చంద్రహాస్ చూపించిన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

​ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించగా, అర్జున్ మహీ ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థలపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

​సాంకేతికంగానూ ఈ సినిమా మంచి గుర్తింపు పొందింది. ఆర్ఆర్ ద్రువన్ సంగీతం, వైఆర్ శేఖర్ ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్ అయ్యాయి. కథానాయకుడిగా చంద్రహాస్ నటన, చిత్రంలోని ఎమోషన్స్ ఓటీటీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి వెండితెరపై సత్తా చాటిన ‘బరాబర్ ప్రేమిస్తా’, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ దూసుకుపోతోంది.

The submit ఓటీటీలోనూ ‘బరాబర్ ప్రేమిస్తా’ జోరు .. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్‌! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.