Sat. Jul 25th, 2026

వైవిధ్యమైన సినిమాలను చేసుకుంటూ వెళ్తున్న నారా రోహిత్ తాజాగా తన కెరీర్‌లోని 21వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. తన పుట్టినరోజు సందర్భంగా నారా రోహిత్ 21వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఈ సారి ‘కపాలి’ అనే వైవిధ్యమైన సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రోహిట్ వెల్లడించాడు.

పోలీసు నేపథ్యంతో సాగే ఈ కథలో మైండ్-బెండింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకటనతో పాటు మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ గన్ని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత పట్నాయక్, లావణ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

The put up కపాలి : సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్‌తో రానున్న నారా రోహిత్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.