Sat. Jul 25th, 2026

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. రియల్ లైఫ్ కపుల్‌ను మళ్లీ వెండితెరపై చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం మొదట సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ పనులు పూర్తి కానందున వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ సినిమాను దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పండుగ సీజన్లలో ఇతర చిత్రాల పోటీ భారీగా ఉండనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ సమర్పిస్తోంది. 19వ శతాబ్దం నాటి 1854 – 1878 బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ చారిత్రక ఘట్టాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

The publish పండుగ సీజన్‌లనే నమ్ముకున్న ‘రణబాలి’..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.