దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీ శ్రీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కాగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా నుంచి త్వరలో మ్యూజికల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీ మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఈ సినిమాలో దుల్కర్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండటంతో వారి కెమిస్ట్రీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రవి నేలకూడితి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
The put up మ్యూజికల్ ట్రీట్ రెడీ చేస్తున్న ‘శ్రీ శ్రీ’..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
