Wed. Apr 22nd, 2026

స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు.

‘భీమవరం బల్మా’ అంటూ సాగే ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ పాటతో నవీన్ తొలిసారి ప్లే బ్యాక్ సింగ్‌గా మారాడు. ఇక ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్, మిక్కీ జే మేయర్ క్యాచీ ట్యూన్స్ తోడవడంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నవీన్ సరసన అందాల భామ మీనాక్షి చౌదరి మంచి మాస్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తోంది.

ఇక ఈ సినిమాను మారి డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2026 జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish క్యాచీ ట్యూన్‌తో ‘భీమవరం బల్మా’ సాంగ్.. నవీన్ అదరగొట్టాడుగా..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.