Sat. May 9th, 2026

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి అనౌన్స్ అయ్యిన క్రేజీ అండ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అలాగే దర్శకుడు కొరటాల శివ కలయికే అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా బజ్ లా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకి కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరి కలయికలో సినిమా అనగానే ఇప్పుడు నుంచే అంచనాలు విపరీతంగా పెరిగిపోగా వీరి కలయికని మ్యాచ్ చేసే సంగీత దర్శకుడు పేరు కోసం కూడా ఇపుడు చర్చగా మారింది.

అయితే తమ కాంబినేషన్ కోసం కొరటాల సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ ని చూస్తున్నట్టు బజ్ వినిపిస్తుంది. అయితే బాలయ్య, అనిరుద్ అనే కాంబినేషన్ వినేందుకు ఎగ్జైటింగ్ గానే ఉంది కానీ బాలయ్య, థమన్ కాంబినేషన్ అనేది అభిమానుల్లో ఒక ఎమోషన్ గా నిలిచింది.

సో అనిరుద్ తో టాక్ నిజమైతే మాత్రం థమన్ ని పక్కన పెట్టినట్టే అనుకోవాలి. డాకు మహారాజ్, భగవంత్ కేసరి, అఖండ, వీర సింహారెడ్డి, దేనికదే సెపరేట్ గా దుమ్ము లేపే మ్యూజిక్ ని బాలయ్యకి అందించిన ట్రాక్ రికార్డు థమన్ కి ఉంది. మరి తనని తప్పించి అనిరుద్ తో దేవర తర్వాత మరోసారి కొరటాల వర్క్ చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

The put up క్రేజీ బజ్.. బాలయ్య X కొరటాల కోసం అనిరుద్? థమన్ ని పక్కన పెట్టేశారా? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.