కొత్త దర్శకుడు రవి కుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రక్తంతో నిండిన చేతులు, బ్యాగు, ఆయుధాలతో ఉన్న పోస్టర్ చూస్తుంటే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఇటీవల థాయ్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో కీలకమైన సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ థాయ్‌లాండ్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని చిత్ర బృందం తెలిపింది.
ఈ సినిమాలో నటుడు కబీర్ సింగ్ ఇప్పటివరకు చూడని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తొలి సినిమా అయినా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసి, ప్రమోషన్స్ వేగవంతం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
The publish చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’.. త్వరలో టీజర్ విడుదల first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
