Sat. May 9th, 2026

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా వరల్డ్ ఫస్ట్ షో భారత కాలమానం ప్రకారం జూన్ 3 రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మే 7 నుంచి ప్రారంభం కానున్నాయి. సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా ప్రీమియర్లకు భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతాయని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

The submit ‘పెద్ది’ వరల్డ్ ఫస్ట్ షో ఎప్పుడు, ఎక్కడంటే..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.