మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌ను మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరు లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశాడు. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇక చిరంజీవి పాల్గొనే మొదటి షెడ్యూల్ ఈ సెట్‌లోనే ప్రారంభం కానుందని.. ఈ షెడ్యూల్‌లోనే సినిమాలోని అత్యంత కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాలని దర్శకుడు బాబీ ప్లాన్ చేశాడట. సాధారణంగా షూటింగ్ ప్రారంభంలో చిన్న చిన్న సీన్లు తీస్తారు, కానీ మెగాస్టార్ సినిమా కావడంతో నేరుగా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌తోనే మెుదలుపెడుతున్నారట.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కెవిఎన్ (KVN) ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి విభిన్నమైన మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
The put up ‘మెగా 158’ మొదలయ్యేది అక్కడి నుంచే..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
