మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గాయపడ్డ సింహం సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, క్లీన్ రిపోర్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే, ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ అండ్ శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్ హిట్లను ఉద్దేశించి చేసిన స్పూఫ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్. ముఖ్యంగా ట్రెండ్ సెట్టర్లగా నిలిచిన సినిమాల రిఫరెన్స్‌లను దర్శకుడు చాలా వాడుకున్నట్లు తెలుస్తోంది.
కేజీఎఫ్, సలార్ సినిమాల గంభీరమైన సీన్లను కామెడీ యాంగిల్‌లో ప్రజెంట్ చేసిన విధానం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమట. బొమ్మరిల్లు సిద్ధార్థ్ ఫేమస్ ‘నాన్న’ డైలాగ్స్‌పై తీసిన స్పూఫ్ ఎపిసోడ్ కడుపుబ్బ నవ్విస్తుందని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అర్జున్ రెడ్డి & పోకిరి మేనరిజమ్స్‌ని క్లాసిక్ కామెడీ టైమింగ్‌తో మిక్స్ చేసి హిలేరియస్‌గా డిజైన్ చేశారట. యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సెన్సార్ సభ్యులు ఈ సినిమాలోని కామెడీ టైమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ స్పూఫ్ ఎపిసోడ్స్ సినిమా కథాగమనంలో భాగంగా వస్తూనే, ప్రేక్షకుడికి ఒక మంచి రిలీఫ్ ఇస్తాయని అంటున్నారు. వేసవి సెలవుల కానుకగా మే 1న విడుదలవుతున్న ఈ చిత్రం, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ‘గాయపడ్డ సింహం’ లోని కామెడీ డోస్ వర్కౌట్ అయితే మాత్రం, బాక్సాఫీస్ వద్ద ఈ సింహం గర్జన మామూలుగా ఉండదు. మొత్తానికి సీరియస్ టైటిల్‌తో వస్తూనే, లోపల ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్‌ను ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
