Wed. Apr 29th, 2026
Toxic Postpone : ‘టాక్సిక్‌’ జూన్ రిలీజ్ వాయిదా వార్తలపై మేకర్స్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ యశ్ తదుపరి చిత్రం ‘టాక్సిక్’ చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు ఒక చిక్కుముడిలో పడింది. అదే ‘డిజిటల్ హక్కుల’ వ్యవహారం. ప్రస్తుతం OTT సంస్థల వైఖరి చూస్తుంటే, సినిమాను సకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ‘టాక్సిక్’ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ OTT సంస్థలు కేవలం 100 కోట్లను మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. అయితే, సినిమా బడ్జెట్, యశ్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ₹300 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ వ్యత్యాసం కారణంగానే ప్రస్తుతం చర్చలు ప్రతిష్టంభనలో పడ్డాయి. గతంలో ‘కేజీఎఫ్’ సాధించిన విజయాన్ని ప్రాతిపదికగా తీసుకుని నిర్మాతలు లెక్కలు వేస్తుండగా, ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూపిస్తూ వెనకడుగు వేస్తున్నాయి.

ఈ ఒప్పందం కుదరకపోవడానికి కేవలం ధర మాత్రమే కాకుండా, OTT సంస్థలు విధిస్తున్న కఠినమైన నిబంధనలు కూడా ఒక ప్రధాన కారణమని సమాచారం. ముఖ్యంగా, కేవలం ₹25 కోట్లను మాత్రమే బేస్ ప్రైస్‌గా ఆఫర్ చేయడం చిత్ర బృందాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే, 25 కోట్లను ముందుగా ఇచ్చి, మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని సినిమా వ్యూస్‌ను బట్టి ఇస్తామని సంస్థలు మెలిక పెడుతున్నాయి. దీనివల్ల పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో అన్న ఆందోళన నిర్మాతల్లో మొదలైంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కావాల్సి ఉంది. కానీ, డిజిటల్ డీల్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో సినిమాను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా భారీ చిత్రాలకు విడుదల ముందే డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ ఆదాయం విషయంలో స్పష్టత లేకపోవడంతో, నిర్మాతలు రిస్క్ తీసుకోలేక షూటింగ్ మరియు రిలీజ్ షెడ్యూల్స్‌ను రీ-అడ్జస్ట్ చేస్తున్నట్లు సమాచారం.