Wed. Apr 29th, 2026

మన టాలీవుడ్ దగ్గర పలు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్ లు మంచి ఆసక్తికరంగా ఉంటాయి. అలా ఇప్పుడు మరో బాక్సాఫీస్ క్లాష్ తప్పనిసరిగా పడబోతోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది మార్చ్ లో విడుదల కావాల్సింది, ఏప్రిల్ అక్కడ నుంచి జూన్ కి వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఉందని అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్ ని మేకర్స్ వాయిదా వేశారు.

అయితే మళ్ళీ లెనిన్ ఉన్న సమయం జూన్ 26 టైం లైన్ పెద్ది సినిమా ఒక రోజు ముందుగా కన్ఫర్మ్ కావడంతో మళ్ళీ లెనిన్ వాయిదా తప్పదు అని పలు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదు అని లెనిన్ మేకర్స్ క్లియర్ చేసేసారు. సో పెద్ది వర్సెస్ లెనిన్ బాక్సాఫీస్ క్లాష్ అనేది కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇలాంటి క్లాష్ లు మన దగ్గర కొత్తేమి కాదు కానీ ఈ పోటీ స్నేహపూర్వకంగా ఉంటే ఎప్పుడూ బాగుంటుంది. మరి ఈ క్లాష్ ఎలా వెళుతుందో చూడాలి.

The submit ఈసారి తగ్గేది లేదు.. ‘పెద్ది’ వర్సెస్ ‘లెనిన్’ బాక్సాఫీస్ క్లాష్ కి ఆల్ సెట్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.