ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “రాకా”. క్రేజీ ఫాంటసీ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊహించని మేకోవర్ లో కనిపించనున్నారు. అయితే ఐకాన్ స్టార్ ఇది వరకే చాలా షూటింగ్ చేసినప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు లేనట్టు కొత్త ట్విస్ట్ వినిపిస్తుంది.
బన్నీ ఇంకో ఏడాది పాటుగా రాకా కోసమే టైం కేటాయించనున్నట్టు కొత్త రూమర్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఇది మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఎప్పటి నుంచో షూట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిడ్ లోపలే బన్నీ పోర్షన్ పూర్తి అవుతుంది అని కూడా మొదట టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మరో ఏడాది పాటుగా ఆగాలి అంటే అది చాలా దూరమే అని చెప్పాలి. దీని మూలాన లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యం కావచ్చు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
The submit ట్విస్ట్.. ‘రాకా’ ఇప్పట్లో పూర్తి కాదా? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
