Sun. May 10th, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప లాంటి సాలిడ్ హిట్ అండ్ ఇంట్రెస్టింగ్ మేకోవర్ తర్వాత తన నుంచి రాబోతున్న మరో ప్రయోగాత్మక చిత్రమే “రాకా”. భారీ బడ్జెట్ తో దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ ఫస్ట్ లుక్ పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.

ఈ సినిమాకి బన్నీ ఇంకా టైం ని స్పెండ్ చేయనున్నట్టుగా వినిపిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలపై కూడా కొత్త రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. మొత్తం అన్నీ సెట్టయ్యి సినిమా విడుదల చేసేందుకు వచ్చే ఏడాది వేసవి తర్వాతే ఈ సినిమా వచ్చే సూచనలు ఉన్నట్టు టాక్. భారీ ఎత్తున ఈ సినిమాకి వి ఎఫ్ ఎక్స్ పనులు కూడా చేయాల్సి ఉంది. ప్రస్తుతం షూట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సో రాకా విడుదల అప్పుడే ఉంటుందా లేక మరింత ఆలస్యం అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.

The publish ‘రాకా’ రిలీజ్ ప్లానింగ్స్? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.