Sat. May 9th, 2026

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ చిత్రం తర్వాత సుమారు మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల అక్కినేని నాగార్జున ఈ చిత్రం గురించి పాజిటివ్ గా స్పందించడం అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధత కూడా ఇప్పుడు తొలిగిపోయింది. ‘పెద్ది’ చిత్ర బృందం తమ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ‘లెనిన్’ జూన్ 26న సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయింది. ఇతర పెద్ద సినిమాల పోటీ లేకపోవడం అఖిల్ కెరీర్‌కు ఈ సమయంలో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాగా, థమన్ అందించిన సంగీతం అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లెనిన్ సినిమాతో అఖిల్ ఈసారి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

The submit ‘లెనిన్’ కు పెద్ద రిలీఫ్ ఇచ్చిన ‘పెద్ది’..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.