Sat. May 9th, 2026

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. విజయ్ ఆఖరి చిత్రంగా భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పటికీ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని ఎన్నికల ముందే విడుదల చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ తర్వాతే రాబోతుంది. ఇక ఈ గ్యాప్ లో చాలానే పరిస్థితులు మారిపోయాయి.

అప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ మొత్తంలో కొనుగోలు చేసుకున్న ఓటికి డీల్ ని వదిలేసుకున్నారు. ఇది మేకర్స్ పెద్ద ఎదురు దెబ్బ కాగా ఇప్పుడు సరికొత్త డీల్ వీరికి వచ్చినట్టు తెలుస్తుంది. కానీ మొదట వచ్చిన ఆఫర్ సగం కూడా లేనట్టు టాక్. ప్రైమ్ వీడియో జన నాయగన్ కి 120 కోట్లకి పైగా ఆఫర్ చేస్తే ఇప్పుడు కేవలం 50 కోట్లకే ఇచ్చే పరిస్థితి వచ్చిందట.

సో ఎక్కడ నుంచి ఎంతవరకు పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అన్నట్టు ఈ ఆఫర్ ని జీ 5 వారు అందించినట్టు టాక్. అయితే ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే కొంచెం అటు ఇటు మొత్తంలో ఫినిష్ కావచ్చని తెలుస్తుంది. సో మరి చూడాలి ఈ సినిమాకి ఏ ఓటిటి సంస్థ సొంతం చేసుకుంటుంది అనేది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

The publish విజయ్ ఆఖరి చిత్రానికి పడిపోయిన ఓటిటి డీల్.. ట్రాక్ లోకి కొత్త సంస్థ వచ్చిందా? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.