Sat. May 9th, 2026

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రణబాలి, రౌడీ జనార్ధన అనే రెండు గ్రాండ్ స్కేల్ సినిమాలు తన నుంచి రానున్నాయి. అయితే ఈ సినిమాల తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఏకంగా వారు హాలీవుడ్ బృందంతో కలిసి పని చేస్తుండడం సినిమాకి మరింత వెయిట్ ని తీసుకొచ్చేలా చేసింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం దర్శకుడు ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సహా తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన బ్యూటీ కృతి సనన్ ఈ సినిమాలో విజయ్ సరసన ఫిక్స్ అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా హీశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం అందిస్తున్నారు.

The submit విజయ్, శౌర్యువ్ భారీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ బ్యూటీ? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.