Wed. Apr 22nd, 2026

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ‘ట్రైసర్‌’ను సంచలన దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. మాస్‌, యాక్షన్‌, భావోద్వేగాలతో కూడిన ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

​ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ.. ట్రైసర్‌ను విడుదల చేసిన హరీష్‌ శంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవిక కథనానికి కమర్షియల్ హంగులు అద్ది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని వెల్లడించారు.

​ఈ సినిమాలో నటీనటులంతా సరికొత్త అవతారాల్లో కనిపించనున్నారు. ఆరి అరుజునన్ తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండగా, యువ హీరో రాజ్ తరుణ్ ఈ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. భరత్, అమ్ము అభిరామి, కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువతలో మంచి గుర్తింపు ఉన్న స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత. యాక్షన్, ఎమోషన్, సామాజిక అంశాల కలబోతగా వస్తున్న ఈ చిత్రం రెండు భాషల ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.

The put up హరీష్‌ శంకర్‌ చేతుల మీదుగా ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ట్రైసర్‌ విడుదల first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.