తాజాగా వచ్చిన ఒక ఊహించని రూమర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అదే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ అంటూ వచ్చిన ఓ టాక్. రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన జైలర్ కి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతుంది. ఇందులో కూడా పలు కామియో రోల్స్ ఉన్నాయి. అయితే వాటిలో బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఉన్నట్టు టాక్ వచ్చింది.
కానీ దానిని తను రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ పేరు అందుకు రీప్లేస్మెంట్ గా వినిపించింది. అయితే పవన్ కూడా ఈ కామియోని రిజెక్ట్ చేసినట్టు కొత్త టాక్ మొదలైంది. అసలు ఈ విషయం పవన్ కి జైలర్ 2 మేకర్స్ కి అయినా తెలుసో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రస్తుతానికి అయితే ఆ సాలిడ్ కామియో కోసం నటుడు ఇంకా దొరకనట్టే అని టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
The put up ‘జైలర్ 2’ కామియో.. పవన్ కూడా రిజెక్ట్ చేశాడా? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
