‘కాంతార’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన ఫాలోయింగ్ లిస్ట్‌ను భారీగా తగ్గించుకుని, కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో ఒకటి ఆయన భార్య ప్రగతి శెట్టి కాగా, మిగిలిన రెండు ఆయన సొంత నిర్మాణ సంస్థ మరియు స్వచ్ఛంద సంస్థకు సంబంధించినవి.
రిషబ్ శెట్టి ఇలా అందరినీ అన్‌ఫాలో చేయడానికి గల కారణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాలపై పూర్తి ఏకాగ్రత పెట్టేందుకే, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ మరియు తన సన్నిహితులను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయినప్పటికీ హోంబలే అధినేత విజయ్ కిరగందూర్ను మాత్రం ఆయన ఇంకా ఫాలో అవుతున్నాడు. కేవలం ప్రైవసీ కోసమా లేక రాబోయే సినిమాల ప్రమోషన్స్ కోసం ఇలా హైప్ క్రియేట్ చేస్తున్నాడా అనేది తెలియాలంటే రిషబ్ శెట్టి స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
The put up ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన రిషబ్ శెట్టి first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
