Tue. Apr 21st, 2026
Tovino Thomas : టాలీవుడ్ మూవీస్ మేకింగ్ పై మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ సెటైర్స్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళం మరియు తెలుగు సినిమాల మేకింగ్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మలయాళంలో కథకు సహజత్వానికి పెద్దపీట వేస్తే.. తెలుగులో భారీతనం కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా ఒక మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్ టాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాను ఎందుకు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయలేకపోతున్నానో ఆయన స్పష్టంగా వివరించారు.

Additionally Learn : Jana Nayagan : రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జననాయగన్’

ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్ టోవినో మాట్లాడుతూ ‘ సాధారణంగా మలయాళంలో సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. “మేం మలయాళంలో ఒక సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి అలవాటు పడ్డాం. కానీ తెలుగులో పరిస్థితి వేరు. ఇక్కడ ఒక ప్రాజెక్టు పట్టాలెక్కి పూర్తవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతోంది. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం నా వల్ల కాదు. ఒక సినిమా కోసం నేను 3 నెలల సమయం మాత్రమే కేటాయించగలను. అంతకుమించి ఒకే ప్రాజెక్టుపై ఉండటం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుగులో ఒక సినిమా ఒప్పుకుంటే అదే సమయంలో మలయాళంలో మూడు మంచి సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. తెలుగు సినిమా మేకింగ్ డిఫరెంట్, మలయాళ సినిమా మేకింగ్ డిఫరెంట్ . తెలుగులో భారీ యాక్షన్ సీక్వెన్సులు, సాంగ్స్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుందని, కానీ కేరళలో షార్ట్ షెడ్యూల్స్ తో సినిమాలు ముగించడం వల్ల ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ మేకింగ్ వేగంపై మరియు మలయాళ నటుల వర్క్ ప్రయారిటీస్ పై కొత్త చర్చకు తెరలేపాయి.