Tue. Apr 21st, 2026

‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ సినిమా నుంచి ‘ఇది కలనో’ అనే అందమైన మెలోడీ గీతాన్ని చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. విజయ్ ఆంటోని, స్వాసికల మధ్య ఉన్న ప్రేమను ఈ పాటలో అద్భుతంగా చూపించారు. బాలాజీ శ్రీరామ్ సంగీతం అందించిన ఈ పాటకు భాగ్యశ్రీ సాహిత్యం సమకూర్చగా.. శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హరీష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్యశ్రీ డైలాగ్ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో అజయ్, కావ్య, బాలాజీ శక్తివేల్, మునిష్ కాంత్, వినోదిని, కర్నాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే నెలలో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ నుంచి ‘ఇది కలనో’ సాంగ్ రిలీజ్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.