Tue. Apr 21st, 2026
Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

 Additionally Learn : Ramayana Section -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్

ఇటీవల తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాసి’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న రామ్ చరణ్  ‘పెద్ది’ విడుదలపై స్పందించాడు. రాకాసి టీమ్ తో చిట్ చాట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ అయ్యిందని నేను కూడా వింటున్నాను. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. పెద్ది సినిమా లేట్ అవ్వదు.. అందరికీ ఇదే విషయం చెప్పండి” అంటూ చరణ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విషయంపై స్పందించడంతో ఈ నెలాఖరున అంటే ఏప్రిల్ 30న సినిమా పక్కాగా విడుదలవుతుందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇంకా రెండు సాంగ్స్, కొంత మేర ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న పెద్ది చెప్పిన డేట్ కు వస్తాడా లేదా వాయిదా వేస్తారా అనేది త్వరలో తెలుస్తుంది.