Wed. Apr 22nd, 2026

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రజనీకాంత్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే చిత్రీకరణ పూర్తి కాబోతుందని వెల్లడించారు.

అంతేకాకుండా, సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొద్ది రోజుల్లోనే నిర్మాణ సంస్థ వెల్లడించనుందని రజనీ కన్ఫర్మ్ చేశాడు. గతంలో ‘జైలర్’ మొదటి భాగం ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘జైలర్ 2’ను కూడా ఈ ఏడాది ఆగస్టు 15 వీకెండ్‌లో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.

ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. మొదటి భాగంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రెండో భాగంలో కూడా క్యామియో రోల్స్‌లో మెరవబోతున్నారు.

The put up ‘జైలర్ 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తలైవా..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.