Wed. Apr 22nd, 2026

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ టాలీవుడ్‌లో సందడి చేస్తోంది. ‘హనుమాన్’ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), ఇప్పుడు కుమారస్వామి నేపథ్యంలో ఒక పౌరాణిక చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ వర్మ కథను అందించి, నిర్మాణ పర్యవేక్షణ చేయనుండగా.. విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి, చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ప్రశాంత్ వర్మ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఇలాంటి వైవిధ్యమైన పౌరాణిక గాథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. సముద్రఖని వంటి ట్యాలెంటెడ్ దర్శకుడు ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

మరోవైపు, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా రాబోతున్న ‘జై హనుమాన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా పట్టాలెక్కనుంది.

The put up హనుమాన్ తర్వాత ఆ దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.