Wed. Apr 22nd, 2026

ట్యాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి లీడ్ రోల్‌లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ డిజిటల్ రిలీజ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2025 ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ రివెంజ్ డ్రామాకు అప్పట్లో మిక్సిడ్ టాక్ లభించింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ డిజిటల్ రిలీజ్ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తమిళ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, తెలుగు వెర్షన్ జాడ లేకపోవడంతో ఆది పినిశెట్టి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు కావడంతో, ఈ చిత్రాన్ని తమ మాతృభాషలో వీక్షించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ ఆలస్యం అంతుచిక్కడం లేదు.

లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు నటించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై జీ5 నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

The publish శబ్దం ఓటీటీ.. అందులో కూడా వచ్చేసింది.. కానీ..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.