Tue. Apr 21st, 2026

తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో, నూతన దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న విభిన్న ఎంటర్టైనర్ ‘గాయపడ్డ సింహం’. సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు.

​ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ‘బ్రూటల్ ధర్మ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ఆయన లుక్ మరియు మేనరిజమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రెట్రో గ్యాంగ్‌స్టర్ వైబ్‌తో, స్టైలిష్ సూట్లు, డార్క్ షేడ్స్ మరియు మెడలో భారీ గోల్డ్ చైన్‌తో జేడీ చక్రవర్తి ఎంతో స్టైలిష్‌గా, అదే సమయంలో క్రూరంగా కనిపిస్తున్నాడు. సత్య లాజిస్టిక్స్ అనే కంపెనీ ముసుగులో అక్రమ రవాణా, డ్రగ్స్ మరియు ఆయుధాల వ్యాపారం చేసే డాన్‌గా ఆయన పాత్రను పరిచయం చేశారు.

​ఈ గ్లింప్స్ చివర్లో వచ్చే సీన్ సినిమాలోని డార్క్ హ్యూమర్‌ను ప్రతిబింబిస్తోంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంపై, జేడీ చక్రవర్తి ఎంట్రీతో అంచనాలు మరింత పెరిగాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The put up ‘గాయపడ్డ సింహం’ కోసం బ్రూటల్ ధర్మ అవతారమెత్తిన జే డీ చక్రవర్తి..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.