యంగ్ హీరో నాగశౌర్య సరికొత్త మాస్ అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. రామ్ దేసిన (రమేష్) దర్శకుడిగా పరిచయమవుతున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో నాగ శౌర్య అలరించేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ట్రైలర్ విషయానికి వస్తే.. దుర్మార్గుల ఆగడాలతో అల్లాడిపోతున్న తమ ప్రాంతాన్ని కాపాడమని దేవుడిని వేడుకుంటున్న నరేష్ విజయకృష్ణ పాత్రతో ఇది ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఎంట్రీ ఇస్తాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సాగే రగ్గడ్ పాత్రలో నాగశౌర్య ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. శత్రువులను ఎదురించి అమాయకులను అతను ఎలా కాపాడాడనేది ఈ చిత్ర ప్రధానాంశంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగశౌర్య గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయి మాస్ నటనతో మెప్పించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనే కాకుండా, సాయికుమార్‌తో కలిసి చేసే కామెడీ సీన్స్‌లోనూ ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంది. హీరోయిన్‌గా విధి గ్లామర్‌తో ఆకట్టుకోగా, సముద్రఖని విలన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. మాస్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The put up బ్యాడ్ బాయ్ కార్తీక్ ట్రైలర్.. నాగ శౌర్య మాస్ చూపిస్తున్నాడుగా..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
