Nayan Sarika: టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉంటుంది నయన్ సారిక. ప్రస్తుతం అమ్మడు ఇండస్ట్రీలో హాట్ ట్రెండింగ్‌గా మారింది. తన నాచురల్ యాక్టింగ్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న ఈ భామ వరుస సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతోంది. ‘గం గం గణేశా’తో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నయన్ సారిక, తర్వాత వచ్చిన ‘క’, ‘ఆయ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాల్లో ఆమె సహజ నటన, పల్లెటూరి అమ్మాయి లుక్‌కు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ‘ఆయ్’లో ఆమె పెర్ఫార్మెన్స్ యూత్‌లో బలే క్రేజ్ తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఆమె నటనను అభినందించడం గమనార్హం. ఇటీవల శ్రీవిష్ణు సరసన ‘విష్ణు విన్యాసం’లోను నటించి సక్సెస్ అందుకుంది. యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ భవిష్యత్‌లో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టుల్లో భాగం కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
READ ALSO: Ultimate Court docket: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
తాజాగా ఈ అమ్మడు సంగీత్ శోభన్ సరసన ‘రాకాసా’ అనే ఫాంటసీ కామెడీ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు సాధించింది. నిహారికా కొనిదెల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ అయ్యి సక్సెస్‌పుల్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో నయన్ సారిక కొత్త లుక్, ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఆమెకు తన అందం మాత్రమే కాకుండా, తన నటనా వైవిధ్యం, కథల పట్ల ఆసక్తి, ఇవన్నీ టాలీవుడ్ యువ హీరోయిన్లలో ఆమెకు ప్రత్యేక స్థానం సంపాదించిపెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Paytm New Function: పేటియం అదిరిపోయే అప్‌డేట్.. కార్డ్ లేకుండానే డబ్బులు! ఎలాగో చూసేయండి..
