Tue. Apr 21st, 2026
Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై సాగుతున్న విపరీతమైన ట్రోలింగ్‌పై నటి రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సినిమా నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా లేక ఉగ్రవాదులా? మమ్మల్ని ఎందుకు అంత దారుణంగా బూతులు తిడుతున్నారు?’ అని ఆమె ప్రశ్నించారు.. ‘కళాకారులు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు, కేవలం స్క్రీన్ మీద కనిపించే పాత్రలను బట్టి లేదా వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదు. సోషల్ మీడియాలో వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదు’ అని ఆమె ఘాటుగా స్పందించారు.

Additionally Learn : Trisha: త్రిష ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

గత కొన్నాళ్లుగా రేణు దేశాయ్ తన వ్యక్తిగత నిర్ణయాలు లేదా పోస్ట్‌ల విషయంలో కొందరు నెటిజన్ల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె లైవ్‌లోకి వచ్చి తన బాధను పంచుకున్నారు.. ‘మేము కూడా మనుషులమే, మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఆర్టిస్టులను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ, ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయకండి’ అంటూ ఆమె కోరారు. ప్రస్తుతం రేణు దేశాయ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ తర్వాత మళ్ళీ వెండితెరపై బిజీ అవ్వాలని చూస్తున్నారు. తన పిల్లల భవిష్యత్తు తన కెరీర్‌పై దృష్టి పెట్టిన ఆమె, ఇలాంటి నెగెటివిటీ వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.

 

View this publish on Instagram

A publish shared by way of renu desai (@renuudesai)