వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్, తన లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’ తో విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాడు. ప్రస్తుతం డిజిటల్ రైట్స్ మార్కెట్ తగ్గినప్పటికీ, ఈ సినిమా నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. దీనితో నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ సాధించింది.
ట్రైలర్‌కు లభించిన పాజిటివ్ రెస్పాన్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు థియేట్రికల్ రెవెన్యూపై ధీమాగా ఉన్నారు. షానీల్ డియో దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, భీమ్స్ సిసిరోలియో సంగీతంతో ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The publish లాభాలతో మొదలు కానున్న ‘డెకాయిట్’..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
