సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2′ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో, అంతకు మించిన అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే, రజనీ ఏమాత్రం విరామం లేకుండా తన 173వ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నాడు.
’తలైవర్ 173’ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం. ఏప్రిల్ లో జరిగే ప్రోమో షూట్ ముగిసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి, 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. మరి నిజంగానే వచ్చే సంక్రాంతి బరిలో రజనీకాంత్ తన కొత్త సినిమాతో ల్యాండ్ అవుతారా అనేది చూడాలి.
The submit పొంగల్ పండగ పై కన్నేసిన సూపర్ స్టార్.. నిజంగానే పోటీలోకి దిగుతాడా..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
