Tue. Apr 21st, 2026

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

​రణబీర్ కపూర్‌ను ఉద్దేశించి నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రను పోషించడానికి రణబీర్ కంటే ఉత్తమమైన నటుడు మరొకరు లేడు. నిస్సందేహంగా రణబీర్ ఈ తరం యొక్క అత్యుత్తమ నటుడు” అని ప్రశంసించాడు. తమ తండ్రుల కాలం నుండి కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, దశాబ్దాల తర్వాత ఇలాంటి ఒక గొప్ప పురాణ గాథను చెప్పడానికి తాము కలిసి రావడం ఒక అద్భుతమైన ప్రయాణమని ఆయన పేర్కొన్నాడు.

​భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నమిత్ తెలిపారు. “వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మన సినీ పరిశ్రమలో ఏడాదికి వెయ్యికి పైగా సినిమాలు వస్తున్నా, పశ్చిమ దేశాల్లో మనం ఇంకా బలమైన ముద్ర వేయలేకపోయాము. భారతీయ సినిమా ఎవరికీ తీసిపోదు. రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ చేరవేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది అందరికీ సంబంధించిన ఒక్కటే రామాయణం, ఒక్కరే రాముడు” అని ఆయన స్పష్టం చేశారు.

The publish ‘రామాయణ’ పై ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.