Tue. Apr 21st, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశీ ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. గత నెల ఉగాది కానుకగా వచ్చిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అయితే కాలేదు. పైగా ధురంధర్ 2 లాంటి సినిమా కూడా ఉండడంతో అంచనాలు తలకిందులు అయ్యాయి. ఇక ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా కొన్ని రోజులు కితమే స్ట్రీమింగ్ కి వచ్చింది.

పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకి ఇక్కడ ఊహించని రెస్పాన్స్ లభిస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా ఈ సినిమా ప్రస్తుతం 10కి పైగానే దేశాల్లో టాప్ 10 లో ట్రెండింగ్ లో కొనసాగుతుందట. ఇది పక్కన పెడితే ఆడియెన్స్ నుంచి మాత్రం మళ్ళీ అదే మిక్స్డ్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో నమోదు అవుతుంది. పవన్ అభిమానుల్లో కొందరికి తప్పితే మిగతా అంతా మిక్స్డ్ గానే ఉన్నారు. సో ఓటిటిలోకి వచ్చాక మాత్రం ఉస్తాద్ పరిస్థితి ఇలా ఉంది.

The publish ఓటిటిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఊహించని రెస్పాన్స్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.