Tue. Apr 21st, 2026

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం “చిరంజీవి”. శుభ సాయి వెంకట్ దర్శకత్వంలో కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కుడివైపు గుండె ఉండే ‘డెక్స్ట్రోకార్డియా’ అనే అరుదైన పాయింట్ చుట్టూ ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు దర్శకుడు శుభ సాయి వెంకట్ తెలిపారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వస్తున్న తనకు కంటెంట్ మీద ఉన్న నమ్మకమే ధైర్యాన్నిచ్చిందని హీరో కికు యనమల అన్నారు. కొత్తవారైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సినిమాపై ఉన్న ప్యాషన్‌తోనే బలమైన కథ, పాత్రలతో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత దీప్తి పేర్కొన్నారు. ఆద్యంతం గ్రిప్పింగ్‌గా సాగే ఈ చిత్రంలో ఊహించని ట్విస్టులు, అద్భుతమైన యాక్షన్, రొమాన్స్ ఉన్నాయని సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ ప్రశంసించారు.

అరకు, రంపచోడవరం వంటి అందమైన లొకేషన్లలో ఈ మూవీని చిత్రీకరించారు. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ వంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

The put up ఘనంగా ‘చిరంజీవి’ మూవీ గ్లింప్స్ లాంఛ్ కార్యక్రమం first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.