Tue. Apr 21st, 2026
Allu-Arjun : హీరో రెమ్యునరేషన్ అంటే ఇలా ఉండాలి! బన్నీ చూపించిన కొత్త దారి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిస్తూ బన్నీకి పెద్ద ఊరటనిచ్చింది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ఫోటోలు, గొంతును ఇష్టానుసారంగా వాడేస్తున్న వారికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ఆయన వ్యక్తిగత హక్కులను (Character Rights) కాపాడుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, గొంతు, హావభావాలని వాణిజ్యపరంగా కానీ, ఇతర ఏ రూపంలో కానీ వినియోగించకూడదని కోర్టు స్పష్టమైన స్టే ఇచ్చింది.

Additionally Learn :Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే

ఒకవేళ ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రముఖుల ఇమేజ్‌ను వాడుకుని తప్పుడు ప్రచారాలు చేయడం లేదా వారి అనుమతి లేకుండా లాభాలు గడించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. కేవలం సినిమా రంగానికే కాకుండా, అందరు సెలబ్రిటీలకు ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కన్నా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ వంటి వారు ఇలానే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.